MovieGQ

Gopala Baludamma

Ooyala (1998) · Track 1 of 5

Song Details

Lyrics

గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా రారా కన్నా కడుపార కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్నా నిను ఆడించే నీ అమ్మనురా నువు ఆడుకొనే నీ బొమ్మనురా గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా గుండెమీద తాకుతుంటే నీ చిట్టి పాదం అందేకట్టి ఆడుతుంది ఈ తల్లి ప్రాణం అందాలతోని సంగీత పాఠం నేర్పావ నాకు నీ లాలి కోసం ఉగ్గు పట్టనా దిష్టి తగలని చుక్కపెట్టన బోసి నవ్వుల బాషతో నువ్వు పిచ్చి తల్లికి ఊసులు చెబుతూ పలకరిస్తావు... గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా ఏ నోము ఫళమో పండి ఈ మొడు కొమ్మ ఈ నాడు నిన్నే పొంది అయిందిర అమ్మా ఇదే నాకు నేడు మరో కొత్త జన్మ ప్రసాదించినాడు ఈ చిన్ని బ్రహ్మ మూసి ఉంచిన లేత పిడికిలి ఏమి దాచెరా నిన్ను పంపుతూ దేవుడు ఇచ్చిన వరములన్నీ గుప్పిట ఉంచి అమ్మ కిచ్చావు... గోపాల బాలుడమ్మా నా చందమామ పదే పదే చూసుకున్నా తనివి తీరదమ్మా రారా కన్నా కడుపార కన్నా నా చిటికెలు వింటూ చూస్తావే నేనెవరో తెలుసా నాన్నా నిను ఆడించే నీ అమ్మనురా నువు ఆడుకొనే నీ బొమ్మనురా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Ooyala

See All