Chupullo Chuttesi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- పల్లవి:
చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
రామ రామ.. పరంధామ.. నా గుండె కొట్టుకొనె ఝల్లుఝల్లుమని
చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
అమ్మదొంగ.. పూలరంగ.. నా ఒల్లు తుళ్లిపడె ఝిల్లుఝిల్లుమని
చూపుల్లో చుట్టేసి మాటల్లో పట్టేసి చేతుల్లో కట్టేసినావు
చరణం: 1
ఆ.. అహాహాహ.. హ.. హా..
ఆహాహా.. ఓహోఓ... ఆ... హ... హా..
ఏహేహే...
సెగ రేపే ఈ సమయం.. ఎగరేసే బిగి పరువం.. లే.. లే.. లెమ్మటుంది
కులుకేసే ఈ నిమిషం.. వెనుదీసె నా హృదయం.. నో.. నో.. నో.. అంటోంది
సెగ రేపే ఈ సమయం.. ఎగరేసే బిగి పరువం లే.. లే.. లెమ్మటుంది
కులుకేసే ఈ నిమిషం.. వెనుదీసె నా హృదయం.. నో.. నో.. నో.. అంటోంది
హోయ్.. కుదిరెను జత.. అహహ.. నవమన్మధ.. అహహ
మొదలాయెలే మొన్నటి కథ..
కనరాని మెలికేసి నను లాగావు.. ఊ..
చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
అమ్మదొంగ.. పూలరంగ.. నా ఒల్లు తుళ్లిపడె ఝిల్లుఝిల్లుమని
చరణం: 2
నడయాడె శశిరేఖ.. నా వలపుల తొలిరేఖ.. నన్నే లోగొన్నావు
ఎదలోని.. పొదలోన.. చదివే ప్రతి పుటలోనా.. నీవే దాగున్నావు

అహహా.. నా పని సరి.. ఓ గడసరి.. అహ..
ఆగదు మరి.. సాగిన ఝరి..
నిలువెల్లా పులకింతలు నింపేశావు.. ఊ..
చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
అమ్మదొంగ.. పూలరంగ.. నా ఒల్లు తుళ్లిపడె ఝిల్లుఝిల్లుమని
చూపుల్లో చుట్టేసి.. మాటల్లో పట్టేసి.. చేతుల్లో కట్టేసినావు
రామ రామ పరంధామ.. నా గుండె కొట్టుకొనె ఝల్లుఝల్లుమని
Oorikichina Maata
Movie More SongsChupullo Chuttesi Keyword Tags
-
-