MovieGQ

Inthakante Vere

Oohalu Gusagusalade (2014) · Track 4 of 4

Lyrics

ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి ఎందుకంటె ఏమో ఎందుకు అని తెలియక తికమక పడుతున్నది మది వందకంటే ఎన్నో కారణాలను ఒకటొకటొకటిగా వివరిస్తున్నది యాహు హూ... యాహు హూ... (2) కోపగించి బుంగమూతి పెట్టినా నిరాకరించి పళ్ళు నూరి తిట్టినా మహాద్భుతం అనేట్టుగానె ఉంది అనుకున్నా ఇదేదో పిచ్చి కదా మరి అనెవ్వరైన అంటె నిజమేనని ఒప్పేసుకుంట అంతేగాని తన వెనకనే పడిన మనసుని ఒద్దొద్దు అని నేనేమైన ఆపగలనా ఆ పిచ్చి బాగుందని మరింత పెంచుకొని ఇలాగే వుండిపోతానంటే తప్పైన ఒప్పైన గాని ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరుగదు మనసీ మాదిరి కత్రిన కరీన అంటు కొంతమంది కోసమే కుర్రాళ్లు అంత కొట్టుకుంటె లోకమందు ఇన్ని వేల జంటలుండవేమో నా కళ్లతోటి చూస్తే సరి తనను మించి మరొకరు లేరని అంటారు కద ఎవ్వరైన అలా అన్నానని ఊరంత వచ్చి తనని నా కళ్లతోటి చూస్తానంటె చూడగలనా నువు నాకే సొంతమని తనతోనే చెప్పాలని అనుకోడం కానీ పైకెనాడు అనలేకపోతున్నా కదా ఇంతకంటె వేరే అందగత్తెలు కనబడలేదని అనననుకో మరి ఎందరెదురైనా సుందరాంగులు తడబడి ఎరగదు మనసీ మాదిరి యాహు హూ... యాహు హూ... (3)

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Oohalu Gusagusalade

See All