MovieGQ

Nuvvu Choodu Chudakapo

Okato Number Kurradu (2002) · Track 2 of 6

Song Details

Lyrics

నువ్వు చూడు చూడకపో నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా ప్రేమించు మించకపో ప్రేమిస్తూనే ఉంటా నా ప్రాణం నా ధ్యానం నువ్వే లెమ్మంట నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా నువ్వు తిట్టినా నీ నోటి వెంట నా పేరొచ్చిందని సంబరపడతా నువ్వు కొట్టినా నా చెంప మీద నీ గురుతొకటుందని సంతోషిస్తా మనసు పువ్వును అందించాను కొప్పులో నిలుపుకుంటావో కాలి కింద నలిపేస్తావో వలపు గువ్వను పంపించాను బొట్టు పెట్టి రమ్మంటావో గొంతు పట్టి గెంటేస్తావో ఏం చేసినా ఎవరాపినా చేసేది చేస్తుంటా నువ్వు చూడు చూడకపో నే చూస్తూనే ఉంటా మాటాడు ఆడకపో మాటాడుతునే ఉంటా పూజించటం పూజారి వంతు వరమివ్వడమన్నది దేవత ఇస్టం ప్రేమించటం ప్రేమికుడి వంతు కరుణించడమన్నది ప్రేయసి ఇస్టం ఎందువల్ల నిను ప్రేమించిందో చిన్ని మనసుకే తెలియదు గా నిన్ను మరవడం జరగదు గా ఎందువల్ల నువు కాదన్నావో ఎదురు ప్రశ్నలే వెయ్యనుగా ఎదురు చూపులే ఆపనుగా ఏనాటికో ఒకనాటికి నీ ప్రేమ సాధిస్తా నిను చూడలని ఉన్నా నిను చూడలని ఉన్నా నే చూడలేకున్నా మాటాడాలని ఉన్నా మాటాడలేకున్నా ప్రేమించాలని ఉన్నా ప్రేమించలేకున్నా లోలోనా నాలోనా కన్నీరవుతున్నా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Okato Number Kurradu

See All