MovieGQ

Swarala Veena Ee Velalona

Oka Raju Oka Rani (2003) · Track 1 of 6

Song Details

Singer
Music Director

Lyrics

స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా ఎండలో ఇలా పూల వానలా మెరుపు కూడ మల్లె తీగలా నేలపై ఇలా నా అడుగు నిలవదా లోకమంత కొత్త చోటులా నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా రేయి చీర కప్పుకున్న చందమామని నిన్ను చూసి ఒక్కసారి పలకరించి వెళ్ళని తారలన్ని అల్లుకున్న మేఘమాలని వాలు కళ్ళ సాగరాన కాటుకల్లె మారని వాలే పొద్దులా జారే నీ జడ నడుము పై నాట్యమే ఆడితే విరిసే పువ్వులా కురిసే మంచులా నువ్వలా చల్లగా నవ్వితే నేను చూడలేను చూశాక ఆగలేను ఎన్నాళ్ళు నిన్ను ఒదిలి ఉండను స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా మూసి ఉన్న రెప్పలల్లో కలల వనములా నిదుర రాని వేళలోన కలవరింతలా ఇలా ఊపిరంత ఊహలతో నిండిపోయినా గుండె లోన నిన్ను ఇంక దాచి ఉంచడం ఎలా నేనే నేనుగా లేనే లేనుగా నాకే వింతగా ఉందిగా నీలా ఎవ్వరు నన్నే ఎప్పుడు కమ్ముకోలేదులే ఇంతగా రేయి నిదుర రాదు పగలంత కునుకు లేదు ఆసలేమయిందో నాకే తెలియదు స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా ఎండలో ఇలా పూల వానలా మెరుపు కూడ మల్లె తీగలా నేలపై ఇలా నా అడుగు నిలవదా లోకమంత కొత్త చోటులా నువ్వు తప్ప కళ్ళ ముందు లేరు ఎవరు నమ్మవా స్వరాల వీణ ఈ వేళలోన నీకేమైయిందే ఆకాశమా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Oka Raju Oka Rani

See All