MovieGQ

Okkasari Cheppaleva

Nuvvu Naaku Nachav (2001) · Track 6 of 6

Song Details

Lyrics

ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ వెన్నెలేదో వేకువేదో నీకు తెలుసా మరి ఓ... నిదుర పొయే మదిని గిల్లి ఎందుకా అల్లరి చరణం: 1 చందమామ మనకందదని ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చంటిపాపలకి చెబుతామా లేని పోని కలలెందుకని మేలుకుంటే అవిరావు అని జన్మలోనె నిదరోకు అని కంటిపాపలకి చెబుతామా కలలన్నవి గలలని నమ్మనని అవి కలవని పిలవకు కలవమని మది మీటుతున్న మధురానుభూతి మననడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని చరణం: 2 అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరిజల్లులతో చుక్కలన్ని దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా అంతులేని తన అల్లరితో అలుపు లేని తన అలజడితో కెరటమెగిరి పడుతూ ఉంటే ఆకాశం తెగి పడుతుందా మనసుంటే మార్గం ఉంది కదా అనుకుంటే అందనిదుంటుందా అనుకున్నవన్ని మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ... చెంత చేరి పంచుకోవా ఆశ నీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పెనంత ఒదిగుండమనక ఒదిలేయమంటు బతిమాలుతున్న వేళ

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nuvvu Naaku Nachav

See All