Song Details
Lyrics
ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి చెంపలో విరబూసే అమ్మాయి సిగ్గు దొంతరలు ఆ సొంపులకు ఎర వేసే అబ్బాయి చూపు తొందరలు ఏ వరాలో ఈ జవరాలై జతపడు సమయంలో వానవిల్లే వధువుగ మారి ఒదిగిన వేడుకలో తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు సనసన్నగా రుసరుసలు వియ్యాలవారి విసవిసలు సందు చూసి చకచక ఆడే జూదశిఖామణులు పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు తమ నిగనిగ నగలను పదుగురి ఎదురుగ ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి చెరి సగమని మనసులు కలుపుతు తెర తెరిచిన తరుణం ఇదివరకెరుగని వరసలు కలుపుతు మురిసిన బంధుజనం మా యిళ్ళ లేత మావిళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైనవి గాలులే
Lyrics sourced from public databases. May contain errors.