Song Details
Lyrics
మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా వెచ్చనైన గుండె గిన్నెలో వెన్నలింత దాచి ఉంచకు పొన్న చెట్టు లేని తోటలో కన్నె వేణువాలపించకు ప్రేమ అన్నదే ఓ పల్లవైనదీ పెదవి తాకితే ఓ పాటలే అదీ ఆమని ప్రేమని పాడే కోయిలా మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా మౌనమైన మాధవీ లత మావి కొమ్మనల్లుకున్నది ఎల్లువైన రాగమిప్పుడే ఏకతాళమందుకున్నది తోచదాయనే ఓ తోడు లేనిదే కౌగిలింతలే ఓ కావ్యమాయలే ఎన్నడు లేనిది ఎందుకో ఇలా మిల మిల మెరిసెను తార నీ ప్రేమలా చిలిపిగ కురిసెను ప్రేమా నీ కన్నులా గాలిలో లాలిలా గానమై ఇలా లాలించెలే నన్నే ఓ పాపలా వేధించెలే నన్నే నీ నీడలా
Lyrics sourced from public databases. May contain errors.