MovieGQ

Epudepudepudani

Nirnayam (1991) · Track 4 of 5

Lyrics

ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ దియ్యాలతో పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం తియ్యందించీ తీర్చనా ఋణం చెయ్యందించే తీరమా బంధించేద్దాం యవ్వనం మనం పండించేద్దాం జీవనం నవ నవమని పరువం ఫలించే పరిణయ శుభతరుణం కువ కువమని కవనం లిఖించే కులుకుల కలికితనం నా ఉదయమై వెలిగే ప్రియ వరం అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం వచ్చే వైశాఖం తెచ్చే వైభోగం పెళ్ళీ పేరంటం ఒళ్ళో వైకుంఠం వెయ్యేళ్ళ దియ్యాలతో అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో వడ్డించమ్మా సోయగం సగం ఒడ్డెక్కించే సాయమా సై అంటున్నా తీయగా నిజం స్వర్గం దించే స్నేహమా పెదవుల ముడి పెడదాం ఎదల్లో మదనుడి గుడి కడదాం వదలని జత కడదాం జతుల్లో సుడిపడి సుఖపడుదాం రా వెతుకుదాం రగిలే రసజగం అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం విచ్చే వయ్యారం ఇచ్చే వైడూర్యం సిగ్గూ సింగారం చిందే సింధూరం వయ్యారి నెయ్యాలతో అహా...ఎపుడెపుడెపుడని అడిగిన వయసుకు కళ్యాణ యోగం ఇపుడిపుడిపుడని నిను నను కలిపెను సన్నాయి రాగం అహా...పద పద పదమని పిలిచిన విరి పొద పోదాం పదమ్మో ఎద ఎద కలిపిన వలపుల హరికథ చెబుదాం రావమ్మో

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nirnayam

See All