Song Details
Lyrics
వేగ వేగ వేసేయ్యర అడుగు వేగం అంటే గాలిని అడుగు గాలే తాకి మబ్బే కరుగు మబ్బే కరిగి చినుకై దూకు చినుకు చినుకు ఏరై ఉరుకు ఏరే కడలై నీరై పొంగు నీరే పొంగి నిప్పై మరుగు నిప్పవరంటే నన్నే అడుగు అడుగులు అడుగులు పిడుగులు అడుగులు చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు మనసుకు భయపడు మనసుల జతపడు మనసుని గెలిచిన మనిషే దేవుడు ఎవర్ని ఫాలో కాను నాతో నేను పోతుంటాను ఎవరికీ పోటి కాను నాకే నేను ఎదురొస్తాను ఎవరితో పంతం లేదు నాతో నేను కలిసుంటాను ఎవరికీ అర్ధం కాను నాకే నేను తెలిసుంటాను ఎవరికీ ఉండని దారుంది వేరెవరికి చెందని తీరుంది పరులెవరికి లొంగని ఫైరుంది నేన్నాలా ఉంటె తప్పేముంది ఎరగను ఎరగను ఎవరిని కెలుకుడు కెలికితే జరుగును ఎముకల విరుగుడు తొడగను తొడగను మనసుకి ముసుగును మనిషిగ మసలిన మనిషే దేవుడు ఎటైనా వెళ్తుంటాను భారం లేదు తీరం లేదు ఏదైనా చేస్తుంటాను ఆశే లేదు హద్దే లేదు ఎలాగో బతికేస్తాను స్వప్నం లేదు సొంతం లేదు ఇలాగే గడిపేస్తాను గమ్యం లేదు లక్ష్యం లేదు నిన్నటి గురుతే లేకుంది మరి నేటికి కొరతే లేకుంది మరునాటికి కలతే లేకుంది ఏదీ లేకుంటే లేనిది ఏది ఎగసిన పిలుపుకి బదులిక వినపడు మెరిసిన కనులకి చెలిమిక కనపడు తెరిచిన మనసుకి మనసుతో ముడిపడు మనిషిగ ఎదిగిన మనిషే దేవుడు
Lyrics sourced from public databases. May contain errors.