MovieGQ

Nee Kosam

Nenunnanu (2004) · Track 7 of 7

Song Details

Lyrics

వేసంకాలం వెన్నెల్లాగ వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరికోసం తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ సొగసు ఎవరికోసం తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీ సిగ్గుల వాకిట్లో నా ముద్దుల ముగ్గేసి నే పండుగ చేసి సందడివేళ ఆకూ వక్కా సున్నం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం గుండె చాటుగా ఉండనందిక ఇన్నినాళ్లు దాచుకున్న కోరికా ఉన్నపాటుగా ఆడపుట్టుకా కట్టుబాటు దాటలేదుగా కన్నె వేడుకా విన్నవించగా అందుబాటులోనె ఉన్నానుగా తీగచాటుగా మూగపాటగా ఆగిపోకె రాగమాలికా నిలువెల్ల నీ జతలోన చిగురించు లతనైరానా కొనగోటి కొంటెతనాన నిను మీటనా చెలివీణా అమ్మమ్మో అబ్బబ్బో ఆ ముచ్చట తీరంగా నీ మెళ్లో హారంగా నా రేకులు విచ్చేసోకులు తెచ్చి అందిస్తున్నా మొత్తం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం సిగ్గుపోరితో నెగ్గలేవుగా ఏడు మల్లెలెత్తు సుకుమారమా సాయమీయకా మోయలేవుగా లేత సోయగాల భారమా కౌగిలింతగా స్వాగతించగా కోరుకున్న కొంగు బంగారమా తాళి బొట్టుగా కాలిమెట్టెగా చేరుకోవ ప్రేమ తీరమా మునిపంటి ముద్దరకానా చిగురంటి పెదవులపైనా మురిపాల మువ్వను కానా దొరగారి నవ్వులలోన నిద్దర్లో పొద్దుల్లో నీ వద్దకు నేనొచ్చి ఆ హద్దులు దాటించి నువ్వొద్దరలేని పద్దతిలోన ముద్దుల్నెన్నో తెచ్చా నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం నీకోసం వేసంకాలం వెన్నెల్లాగ వానల్లొ వాగుల్లాగ వయసు ఎవరికోసం తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి శీతాకాలం ఎండల్లాగ సంక్రాతి పండుగలాగ సొగసు ఎవరికోసం తోం ధిరి తోం ధిరి తోం ధిరి ధిరి ధిరి ధిరి ధిరి తోం ధిరి ఓరోరి అందగాడా నన్నేలు మన్మధుడా నీకోసం - నీకోసం నీకోసం - నీకోసం నీకోసం - నీకోసం నీకోసం - నీకోసం నీకోసం - నీకోసం నీకోసం

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Nenunnanu

See All