Choosa Choosa
Song
Movie
-
Music Director
-
Lyricists
- S.A. Rajkumar
Singers
- Udit Narayan
Lyrics
- చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
అల్లరి వయసుల్లొ ఆనందం చూశాను
చూశాను చూశాను ఆది నాలో దాచాను
వేల కోటీ తారాల్లోనా జాబిళమ్మా నువ్వే కదా
వంద కోటీ అమ్మాయిల్లో అమ్ము నువ్వు నా సొంతం కదా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
నీతో పాటూ ఉంటానంటూ కోరిన మనసును చూశానూ
నీ తోడుగా ఉండాలంటూ వెళ్ళిన నీడను చూశాను
మూడో మనిషే లేని ఓ సుందర లోకం చూశా
నువ్వు నేనే కాదు నీ ప్రేమను కూడా చూశా
నువు నా లోనే సగమైతే నన్నే కొత్తగ చూశాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
సీతా కోక సిగ్గుల్లోనా ఎన్నెన్నో మెరుపులు చూశాను
వీచే గాలీ పరుగుల్లోనా ఏవేవో మలుపులు చూశాను
ఆశల జలపాతంలో అరవిరిసిన అందం చూశా
శ్వాసల సంగీతం లో వినిపించే గానం చూశా
జడి వానలలొ జల్లులలో చినుకె నువ్వానీ చూశాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
చూశా చూశా చూశా చూశా
పున్నమి వెన్నెల్లో నే నిన్నే చూశాను
చూశాను చూశాను నీ దాసుడినయ్యాను
Nava Vasantham
Movie More SongsChoosa Choosa Keyword Tags
-