Song Details
Lyrics
ద్వాపరమంతా సవతుల సంతా జ్ఞాపకముందా గోపాలా కలియుగమందూ ఇద్దరి ముందూ శిలవయ్యావే స్త్రీలోల కాపురాన ఆపదలని ఈదిన శౌరీ ఏదీ నాకూ చూపవా ఒక దారీ నారీ నారీ నడుమ మురారీ నారీ నారీ నడుమ మురారీ ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమునకలుగా తడిసితివా చిరుబురులాడేటి శ్రీదేవి నీ శిరసును వంచిన కథ కన్నా రుసరుసలాడేటి భూదేవి నీ పరువును తీసినా కథ విన్నా గోవిందా... గోవిందా... గోవిందా... సాగిందా జోడు మధ్యల సంగీతం బాగుందా భామలిద్దరి భాగోతం ఇంటిలోన పోరంటే ఇంతింత కాదయా అన్నాడు ఆ యోగి వేమనా నా తరమా భవసాగర మీదనూ అన్నాడు కంచెర్ల గోపన్న పరమేశా గంగ విడుము పార్వతి చాలున్ ఆ మాటను విని ముంచకు స్వామీ గంగన్ ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇంతులిద్దరైనప్పుడు ఇంతే గతిలే సవతుల సంగ్రామంలో పతులది వెనకడుగే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా భామ కాలు తాకిందా కృష్ణుడే గోవిందా అన్నాడు ఆ నందితిమ్మనా ఒక మాట ఒక బాణము ఒక సీత నాదని అన్నాడు సాకేత రామన్న ఎధునాథా భామ విడుము రుక్మిణి చాలున్ రఘునాథా సీతను గొని విడు శూర్పనఖన్ రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే రాసలీలలాడాలని నాకు లేదులే భయభక్తులు ఉన్న భామ ఒకతే చాలులే ఇరువురు భామల కౌగిళిలో స్వామి ఇరుకున పడి నీవు నలిగితివా వలపుల వానల జల్లులలో స్వామీ తలమునకలుగా తడిసితివా గోవిందా... గోవిందా... గోవిందా...
Lyrics sourced from public databases. May contain errors.