Song Details
Lyrics
పల్లవి: చినుకులా రాలి చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా హా మమత నీవేసుమా చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ చరణం: 1 ఆకులురాలె వేసవిగాలి నా ప్రేమ నిట్టూర్పులే కుంకుమపూసె వేకువ నీవై తేవాలి ఓదార్పులే ప్రేమలుకోరె జన్మలలోని నేవేచి ఉన్నానులే జన్మలుదాటె ప్రేమను నేనై నేవెల్లువౌతానులే ఆ చల్లనీ గాలులే... హిమములా రాలి సుమములై పూసి రుతువులై నవ్వి మధువులై పొంగి నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ శిశిరమైన సిధిలమైన విడిచిపోబోకుమా విరహమై పోకుమా చరణం: 2 తొలకరికోసం తొడిమనునేనై అల్లాడుతున్నానులే పులకరమూదె పువ్వులకోసం వేసారుతున్నానులే నింగికినేల అంటిసలాడె ఆ పొద్దురావాలిలే నిన్నలు నేడై రేపటి నీడై నాముద్దు తీరాలిలే ఆ తీరాలు చేరాలిలే... మౌనమై మెరిసి గానమై పిలిచి అలలతో అలిసి గగనమై ఎగసి నీ ప్రేమ నా ప్రేమ తారాడే మన ప్రేమ భువనమైనా గగనమైనా ప్రేమమయమే సుమా... ప్రేమ మనమే సుమా... చినుకులా రాలి నదులుగా సాగి వరదలైపోయి కడలిగాపొంగు నీ ప్రేమ నా ప్రేమ నీ పేరే నా ప్రేమ నదివి నీవు కడలి నేను మరిచిపోబోకుమా... మమత నీవేసుమా...
Lyrics sourced from public databases. May contain errors.