Song Details
Lyrics
సుడిగాలల్లే దూసుకెళరా గమ్యం ఎటు ఉన్నా తూఫానల్లే ఎగసిపడరా గమనం ఏదైనా కసి పెంచెయ్ రా కండలే కరిగించేయ్ రా కొలిమైపోరా నిప్పులే మరిగించెయ్ రా అడుగు అడుగున సుడిగాలల్లే దూసుకెళరా గమ్యం ఎటు ఉన్నా ఓఓఓఓ ఓర్పుగ ఉంటే నేర్చుకుంటే ఓటమె ఒక ఖడ్గం ఉప్పెనలున్నా నిప్పులున్నా వదలకు నీ లక్ష్యం నర నరమూ పిడికిలి చేసుకో ప్రతి క్షణమూ వరమని వాడుకో గురిపెడితే గుండెలు చీల్చరా తలతెగినా కల ఛేధించరా ఈ గాలి పంటిలో నీ పేరు మోసేలా ఈ నేల గుండెల్లో నీ గురుతులుండేలా సుడిగాలల్లే దూసుకెళరా గమ్యం ఎటు ఉన్నా తూఫానల్లే ఎగసిపడరా గమనం ఏదైనా ఓఓఓ
Lyrics sourced from public databases. May contain errors.