Mavayya Anna Pilupu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. BalasubrahmanyamP. Susheela
Lyrics
- మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
అరచేత పెంచాను చెల్లిని
ఈ అరుదైన బంగారు తల్లిని
అడుగేస్తే పాదాలు కందవ
నా కన్నుల్లో కన్నీళ్లు చిందవ
అమ్మగా లాలించాడు నిన్ను నాన్నగా పాలించాడు
అన్నగా ప్రేమించాడు అన్ని తానైనాడు
తన ప్రాణంగా నను పెంచాడు
ఆ దైవంగా దీవించాడు
మా అమ్మలాంటి అన్న ఈ లోకాన లేడు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
ఆరు ఏడు మాసాలు నిండగా
ఈ అన్నయ్య కలలన్ని పండగ
తేవాలి బంగారు ఊయల .. కావాలి మా ఇల్లు కోవెల
రెప్పగా నిను కాచనా .. పాపగా నిను చూడనా
రేపటి ఆశ తీరగా .. నీ పాపకు జోల పాడనా
ఇది అరుదైన ఒక అన్న కధ
ఇది మురిపాల ఒక చెల్లి కధ
ఇది చెల్లెలే కాదులే నను కన్నా తల్లి
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
కమ్మగా పాడనా చంటి పాప జోల
కానుకే ఇవ్వనా చెల్లికి ఉయ్యాల
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
మావయ్య అన్న పిలుపు
మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు
Muddula Mavayya
Movie More SongsMavayya Anna Pilupu Keyword Tags
-
-