Song Details
Lyrics
రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి చరణం: 1 నాడు పట్టు చీర కట్టవద్దు బరువన్నాడే నేడు నూలు చీరకే డబ్బులు కరువన్నాడే నెలతప్పిన నెలత తనకు పరువన్నాడే నేడు నెలబాలుని చేతికిస్తే బరువన్నాడే ముంగురులను చూసి నాడు మురిసిపోయాడే ఆ కురులకు విరులివ్వడమే మరిచిపోయాడే ప్రేమించు season లో పెద్ద మాటలు పెళ్ళయ్యాక plate ఫిరాయింపులు మొదటి వలపు మధుర కథలు మరచెను ఘనుడు మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి చరణం: 2 మాటల్తో కోట కట్టాడే అమ్మో నా మహారాణి నీవన్నాడే కాలు కింద పెడితేనే కందిపోవునన్నాడే వాలు తాకితే మోమున కాలు విరుగునన్నాడే కవ్వించుకున్నాడే కౌగిలి కోసం ఆ కాస్తా తీరాకా మొదటికే మోసం మనవి వినడు మనసు కనడు మాయల మొగుడు మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగవారినిలా నమ్మరాదే చెలి రాదే చెలి నమ్మరాదే చెలి మగనాళి మనస్సమ్మరాదే చెలి తలలో నాలుకలా పూసలలో దారంబు మాట్టే సతి మదిలో నన్నెలగిడు పురుషుడు కలుగుట తొలి జన్మము నోమభయము తోయజనేత్రా తనుగా వలచిన వరుడేనా ఈ పురుషోత్తముడు వ్రతములు సలిపిన సతులకు గతి కలదా ఇలలో కలదో లేదో
Lyrics sourced from public databases. May contain errors.