Song Details
Lyrics
పల్లవి: ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ... శ్రీరామ నామాలు శతకోటి... ఒక్కొక్క పేరు బహుతీపి... బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి ..... చరణం: 1 తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...దశరధరామయ్య స్థవనీయుడు... తండ్రి ఆనతి తలదాల్చు తనయుడు...దశరధరామయ్య స్థవనీయుడు.. కడుమేటి విలు విరిచి కలికిని చేపట్టు కళ్యాణరామయ్య కమనీయుడు కమనీయుడు... శ్రీరామ నామాలు శతకోటి ..... ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి ..... చరణం: 2 సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...సుందరరామయ్య సుకుమారుడు సుదతి జానకి తోడ శుభ సరసమాడేటి...సుందరరామయ్య సుకుమారుడు కోతిమూకలతో ..... ఆ.. ఆ... ఆ... కోతిమూకలతో లంకపై దండెత్తు...కోదండరామయ్య రణధీరుడు...రణధీరుడు శ్రీరామ నామాలు శతకోటి ఒక్కొక్క పేరు బహుతీపి ...బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి చరణం: 3 పవమానసుతుడు పాదాలు పట్టగా...పట్టాభిరామయ్య పరంధాముడు పవమానసుతుడు పాదాలు పట్టగా...పట్టాభిరామయ్య పరంధాముడు అవనిలో సేవించు ఆశ్రితుల పాలించు...అచ్యుతరామయ్య అఖిలాత్ముడు అఖిలాత్ముడు.. శ్రీరామ నామాలు శతకోటి ..... ఒక్కొక్క పేరు బహుతీపి ..... బహుతీపి శ్రీరామ నామాలు శతకోటి
Lyrics sourced from public databases. May contain errors.