Venuvai Vachchanu Bhuvananiki
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్ని మౌన గానం
వాంఛలన్ని వాయులీనం
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మాతృదేవోభవ (మాతృదేవో భవ)
పితృదేవోభవ (పితృదేవో భవ)
ఆచార్యదేవోభవ (ఆచార్యదేవో భవ)
ఏడు కొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
ఏడు కొండలకైన బండ తానొక్కటే
ఏడు జన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలత లో వెలుగునే కనక
నేను మేననుకుంటే ఎద చీకటే
హరీ... హరీ... హరీ...
రాయినై ఉన్నాను ఈ నాటికి
రామ పాదము రాక ఏ నాటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
నీరు కన్నీరాయే ఊపిరే బరువాయే
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్య బంధాలు
పుట్టిల్లు చేరే మట్టి ప్రాణాలు
హరీ... హరీ... హరీ...
రెప్పనై ఉన్నాను నీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయాను గగనానికి
గాలినై పోయాను గగనానికి
- వేణువై వచ్చాను భువనానికి
Matru Devobhava
Movie More SongsVenuvai Vachchanu Bhuvananiki Keyword Tags
-
-
-