Song Details
Lyrics
తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది ఆ... తిలోత్తమా ప్రియ వయ్యారమా... చరణం: 1 పెదవే ఓ మధుర కవిత చదివే అడుగే నా గడపనొదిలి కదిలే ఇన్నాళ్ళు లేని ఈ కొత్త బాణీ ఇవ్వాళే మనకెవరు నేర్పారమ్మా ఈ మాయ చేసింది ప్రేమే ప్రియా ప్రేమంటే ఒకటైన మనమే తిలోత్తమా సుఖ వసంతమా చరణం: 2 కలలే నా ఎదుట నిలిచె నిజమై వలపే నా ఒడికి దొరికె వరమై ఏ రాహువైనా ఆషాఢమైనా ఈ బహుబంధాన్ని విడదీయునా నీ మాటలే వేదమంత్రం చెలి నువ్వన్నదే నా ప్రపంచం తిలోత్తమా ప్రియ వయ్యారమా ప్రభాతమా శుభ వసంతమా నే మోయలేనంటూ హృదయాన్ని అందించా నేనున్నా లెమ్మంటూ అది నాలో దాచేశా ఏ దారిలో సాగుతున్నా ఎద నీవైపుకే లాగుతోంది ఏ వేళలో ఎప్పుడైనా మది నీ ఊహలో ఊగుతోంది
Lyrics sourced from public databases. May contain errors.