Thammudu Are Thammudu
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు
థాంక్యూ... తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
మీరింత బాగా పాడగలరని మేమస్సలనుకోలేదు మాస్టర్
ఇంతవరకు నేనెప్పుడూ పాడలేడోయ్ ఇదే ఫస్ట్ టైం
సార్ మొదటిసారి మీరు అదరగొట్టేశారు సార్
ఆ మీ ఉత్సాహం చూసి ఏదో సరదాగా హమ్ చేయాలనిపించింది చేశానంతే
మాస్టర్ ఈ పాటకి మంచి స్టెప్ కలిసిందంటే అదురుతుంది
డాన్సేగా చాలా బాగుంటుంది చేయండి
హే... మేము కాదు మాస్టర్ మీరు
నేను డాన్సా నో నో నో
ప్లీజ్ సర్ ప్లీజ్
ఓకే ఓకే హేయ్...
వేల వేల భాషలున్న నేల మీద ఎక్కడైనా ప్రేమ గ్లామరొక్కటే లవరు
ఆ లాంగ్వేజ్ తెలియనిదెవరూ
మూగసైగలైన చాలు వేడి ఊపిరైన చాలు గుర్తుపట్టలేరా ప్రేమికులు
అవి అచ్చుతప్పు లేని ప్రేమలేఖలు
అమెరికాలో ఇంగ్లిష్ ప్రేమ
ఆఫ్రికాలో జంగిల్ ప్రేమ
హా ఏకమయ్యే ఏకాంతంలో ఎక్కడైనా ఒకటే ప్రేమ
తమ్ముడు అరె తమ్ముడు
పొట్టివాళ్లు పొట్టవాళ్లు నల్లవాళ్ళు తెల్లవాళ్ళు
ప్రేమదేశం వెళ్లగానే మానవులుగా మిగులుతారు
తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
లక్షాలాది లక్షణాలు చూపుతున్న ప్రేమకున్న అక్షరాలు మాత్రం రెండు
అది మహాసముద్రం ఫ్రెండు
సెంచరీల కొద్ది పెద్ద సీరియల్గా సాగుతున్న మహా నవలరా ప్యారు
ఆ స్టోరీ కొట్టదు బోరు
కా గుణింతం తెలియని వాళ్లు కాళిదాసులు అయిపోతారు
హా కాఫీ టీలే తాగని వాళ్లు దేవదాసులు అయిపోతారు
అమ్మడు ఓయ్ అమ్మడు లబ్బుడబ్బు హార్ట్ బీట్ లవ్వులవ్వు అన్నదంటే
హైక్లాసు లోక్లాసు చూసుకోదు ప్రేమ కేసు
తమ్ముడు అరె తమ్ముడు
ఈ తికమక తెగులే ప్రేమంటే
ఈ తెలియని దిగులే ప్రేమంటే
నను అడగర చెబుతా డౌటుంటే
నువు బెదరవు కదా నా మాటింటే
అమ్మడు ఓయ్ అమ్మడు
నువు మరీ పరాగ్గా ఉంటుంటే
నీకు నిదరే సరిగా రాకుంటే
ఏం జరిగిందో తెలియాలంటే
ఆ రహస్యాన్ని చెబుతా వింటే
మాస్టారూ మాస్టారూ మాంచి లెక్చర్ ఇచ్చారు
మాస్టారూ మాస్టారూ లవ్లో మీరు మెగాస్టారు
- తమ్ముడు అరె తమ్ముడు
Master
Movie More SongsThammudu Are Thammudu Keyword Tags
-
-
-