Kondapalli Mannutho
Song
Movie
-
Music Director
-
Lyrics
- పల్లవి:
కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో
కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో
మలచిన బొమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది
తందాన తాన తననన తందాన తాన (2)
చరణం: 1
కోటేరంటి ముక్కే చేశా కోన సీమ మన్నుతో
పట్టువంటి చెక్కిలి చేశా పట్టిసీమ మన్నుతో
గుస గుస చెవులు చేశా గుంటూరు మన్నుతో
తేనెలూరు పెదవి చేశా తణుకు చెరుకు మన్నుతో
కులుకు మబ్బు కురులుకేమో కృష్ణవేణి మన్నండి
శంఖమంటి మెడకు మాత్రం శంకవరం మన్నండి
అందాలమ్మ నుదురు తీర్చు మన్నే ఇలను లేదండి
చందమామ మన్నే తెచ్చి నుదురు తీర్చా చూడండి
ఎదురు దీనికేదండి
కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో
మలచిన బొమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది
చరణం: 2
కూచిపూడి మన్నే తెచ్చా కులుకులమ్మ చేతికి
పాలకొల్లు మన్నెతెచ్చా పైట చాటు సొగసుకి
నందికొండ మన్నే తెచ్చా నాజూకైనా నాభికి
నాగుల్లంక మన్నే తెచ్చా నాగమల్లి నడుముకి
కాళహస్తి వీధుల్లోన మన్నెతెచ్చా కాళ్ళకి
గోలుకొండ కోటలోని మన్నే తెచ్చా గోళ్ళకి
ఊరూరు మన్నే తెచ్చి రూపమిచ్చా ఒంటికి
నా ఊపిరేపోసి జీవమిచ్చా కంటికి
జీవమిచ్చా కన్నెకి
కొండపల్లి మన్నుతో గోదారమ్మ నీళ్లతో
మలచిన బొమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది
ఓ ప్రాణమున్న గుమ్మరా ఇది
తందాన తాన తననన తందాన తాన (4)
- పల్లవి:
Manikyam
Movie More SongsKondapalli Mannutho Keyword Tags
-