MovieGQ

Aavesham Ravali Avedana Kavali

Manasu Mangalyam (1971) · Track 4 of 7

Song Details

Lyrics

ఆవేశం రావాలి ఆవేదన కావాలి గుండెలోని గాయాలు మండించే గేయాలు గుండెలోని గాయాలు మండించే గేయాలు వేదనలై శోధనలై రగలాలి విప్లవాలు రగలాలి విప్లవాలు ఆవేశం రావాలి ఆవేదన కావాలి నరజాతిని భవితవ్యానికి నడిపేదే ఆవేశం పదిమందికి భవితవ్యాన్ని పంచేదే ఆవేదన వేగంతో వేడిమితో సాగేదే జీవితం సాగేదే జీవితం ఆవేశం రావాలి ఆవేదన కావాలి రణదాహం ధనమోహం కాలి కూలిపోవాలి సమవాదం నవనాదం ప్రతి ఇంటా పలకాలి ప్రతి మనిషీ క్రాంతి కొరకు రుద్రమూర్తి కావాలి రుద్రమూర్తి కావాలి ఆవేశం రావాలి ఆవేదన కావాలి తరతరాల దోపిడీల ఉరితాళ్ళను తెగతెంచి నరనరాల అగ్నిధార ఉప్పెనలా ఉరికించి మరో కొత్త ప్రపంచాన్ని మనిషి గెలుచుకోవాలీ నిదురించిన నా కవితను కదలించిన ఆవేశం మరుగు పడిన నా మమతకు తెర విప్పిన ఆవేదన కన్నుగప్పి వెళ్ళింది నన్ను మరచిపోయింది నన్ను మరచిపోయింది

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Manasu Mangalyam

See All