Sri Ranga Ganga
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పల్లవి:
శ్రీ రంగ రంగ నాధుని దివ్య రూపమే చూడవే
శ్రీదేవి రంగనాయకి నామం సంతతం పాడవే
నీలవేణిలో నీటిముత్యాలు
కృష్ణవేణిలో అలల గీతాలు
నీలవేణిలో నీటిముత్యాలు నీరాజాక్షుడికి పూలుగా
కృష్ణవేణిలో అలల గీతాలు క్రిష్ణగీతలే పాడగా
చరణం: 1
క్రిష్ణ తీరాన అమరావతిలో శిల్పకళావాణి పలికిన శ్రుతిలో
అలలై పొంగెను జీవన గీతం
కలలే పలికించు మధు సంగీతం
చల్లగా గాలి పల్లకిలోన పాట ఊరేగగా
వెల్లువై గుండె పల్లె పదమల్లి పల్లవే పాడగా
శ్రీ త్యాగరాజ కీర్తనై సాగే తీయని జీవితం
చరణం: 2
గంగను మరపించు ఈ కృష్ణవేణి
వెలుగులు ప్రవహించు తెలుగింటి రాణి
పాపాల హరియించు పావన జలము
పచ్చగా ఈ నేల పండించు ఫలము
ఈ ఏటి నీటి పాయలే తేటగీతులే పాడగా
సిరులెన్ని పండి ఈ భువి స్వర్గలోకమై మారగా
కల్లాకపటమే కనరాని ఈ పల్లెసీమలో
- పల్లవి:
Mahanadi
Movie More SongsSri Ranga Ganga Keyword Tags
-
-
-