Jatha Kalise Iddaram
Song
Movie
-
Music Director
-
Lyrics
- జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం సుఖం సుఖం సుఖం
జతకలిసే ఇద్దరం
ప్రతిరేయి శోభనం, శోభనం
పాతనేది కొత్తగా కొత్తనేది వింతగా
కొంగుచాటు కవ్వింతగా
ముద్దుమీద ముద్దుగా మూడు ముళ్ళు గుచ్చగా
ఇల్లే ఈ కౌగిలింతగా
నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు
తొడిమ లేని సనజాజుల నిప్పులు
నడుమ నడుమ చిరుగాజులు చప్పుడు
తొడిమ లేని సనజాజుల నిప్పులు
చుప్పనాతి నోళ్ళకి చూడలేని కళ్ళకి
కలుసుంటే ఇద్దరం కన్నీళ్ల కలవరం
ఒళ్ళంతా కంపరం ఆ పైన చలి జ్వరం
జ్వరం జ్వరం జ్వరం జ్వరం
జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం సుఖం సుఖం సుఖం
మొన్నకన్న మోజుగా నిన్నకన్న రంజుగా
రోజురోజుకీ లబ్జుగా
పగలు కూడ రాత్రిగా రతుల మొదటి రాత్రిగా
సిగ్గుతాకితే చిచ్చుగా
వెలుగువెనక ఆడుకునే ఆటలు
వెతికి వెతికి అందుకునే వేటలు
వెలుగువెనక ఆడుకునే ఆటలు
వెతికి వెతికి అందుకునే వేటలు
చప్పరాని వాళ్ళకి చెప్పుకింద కీళ్ళకి
ఒకటైతే ఇద్దరం అల్లరే ఆగడం
అసూయ ఆగ్రహం ఆపైన చలి జ్వరం
స్వయంవరం ప్రియంవరం
జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
చూపులున్న తలుపులకి చెవులున్న గోడలకి
సరిపడదీ లాంఛనం
ఈనాడె ఇద్దరం ఆ పైన ముగ్గురం
ఆపైన నలుగురం
ఆపైనా...
ఆపేస్తే అదే సుఖం
సుఖం - సుఖం, సుఖం - సుఖం
- జతకలిసే ఇద్దరం ప్రతిరేయి శోభనం
Magadheerudu
Movie More SongsJatha Kalise Iddaram Keyword Tags
-