Andham
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Karthik
Lyrics
- పల్లవి:
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
ఆనంద రాజ్యపు రాణివి నీవు
నాముందు నిలిచావు
అదృష్ట గీతాల భాణీవు నీవు
నాలోన పలికావు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
చరణం: 1
మేఘాలకు విలువేముంది నీ కురులై మెరవకపోతే
గగనాన్నే వదిలేసి కలిశాయంట నీలో
ముత్యాలకు విలువేముంది నీ మాటై వెలకపోతే
సంద్రాన్నే విడిచేసి చేరాయంట నీలో
పువ్వుకు విలువేముంది నీ నవ్వై నిలవక పొతే
నవ్వుకు విలువేముంది నువు నవ్వకుంటే
నువ్వేలేని నాకు విలువేది
యవ్వనమంటు నీది అన్నాలే
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
చరణం: 2
సూర్యుడికే వెలుగొచ్చింది నీ చూపులు సోకంగానే
లోకాన్నే లెమ్మంటు చూపించాడు నిన్నే
కోవెలకే వెలిగొచ్చింది నీ అడుగులు తాకంగానే
దైవాలే మేల్కొంటు దీవించేను నిన్నే
కలలకు వెలుగొచ్చింది కనులెదుటే నువ్ కనిపించి
కవితకు వెలిగొచ్చింది నిను వర్ణించి
నేనే నీతో వెలిగాలే నాలో వెలుగు నీవనేదిలే
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
ఆనంద రాజ్యపు రాణివి నీవు
నాముందు నిలిచావు
అదృష్ట గీతం భాణీవు నీవు నాలోనే పలికావు
అందం నీ అస్సలు పేరు
వయ్యారం నీ కొస్సరు పేరు
ఉల్లాసాలే నువ్వుండే ఊరు
Maa Annayya Bangaram
Movie More SongsAndham Keyword Tags
-
-