MovieGQ

Andhala O Chilaka

Letha Manasulu (1966) · Track 2 of 9

Song Details

Lyrics

పల్లవి : అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా అందాల చెలికాడా అందుకో నా లేఖ నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను చరణం: 1 మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని మిసమిసలాడే వెందుకని తళతళలాడే వేమిటని కురుల మోముపై వాలెనేలనో విరులు కురులలో నవ్వెనెందుకో అడుగుతడబడే చిలకకేలనో పెదవి వణికెను చెలియకెందుకో అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా చరణం: 2 మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి మిసమిసలాడే వయసోయి తళతళలాడే కనులోయి కురుల మోముపై మరులు గొనెనులే విరులు కురులలో సిరులు నింపెలే అడుగుతడబడి సిగ్గు బరువుతో పెదవి వణికెలే వలపు పిలుపుతో అందాల చెలికాడా అందుకో నా లేఖ నా కనులతో రాసాను ఈ మదిలోన దాచాను అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా చరణం: 3 నీవే పాఠం నేర్పితివి నీవే మార్గం చూపితివి ప్రణయ పాఠము వయసు నేర్పులే మధుర మార్గము మనసు చూపులే నీవు పాడగా నేను ఆడగా యుగము క్షణముగా గడచిపోవుగా అందాల ఓ చిలకా అందుకో నా లేఖ నా మదిలోని కలలన్నీ ఇక చేరాలి నీదాకా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Letha Manasulu

See All