Song Details
Lyrics
గుళ్ళో దేవుడు ఎదురై ఒక వరమే కోరెనుగా ఈ ఇంట్లో మనిషిగా మసలే అవకాశం అడిగెనురా అలుపే రాని కేరింతలు తను మురిసీ మన రాగాలలో అనురాగాలలో తను కూడా మనలాగే మురిసీ చరణం: 1 ఇందరుండగా ఇరుకైన ఇంటిలో కష్టాలకింక చోటు లేక చేరుకోవుగా కాంతులుండగా ప్రతి వారి కంటిలో ఆ రంగుదాటి కంటినీరు పొంగిరాదుగా చొరవలు లేని సంతోషం అలకలు ఉన్నా అరనిమిషం ఎన్నెన్నొ ఉన్నాయి లేని దొకటే కల్మషం చరణం: 2 అమ్మ వాకిలి నాన్నేమో లోగిలి ఈ చిన్ని పాప చంటి నవ్వు ఇంటి జాబిలి అన్నగోపురం వదినమ్మ గుమ్మమై ఇక తమ్ముడేమో కోటగోడ లాంటి కావలి మనసే ఏ తిధులు లోకాలే అతిధులు
Lyrics sourced from public databases. May contain errors.