MovieGQ

Lele Baba Niddura Levayya

Kunthi Puthrudu (1993) · Track 1 of 8

Song Details

Lyrics

లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్య రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చరగ తలుపు తీసెరా బాబా లే లే లే లే లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ ఆ... వేగు చుక్క తిలకమెట్టి వేద మంత్ర పువ్వులు పెట్టీ పాద సేవ చేసుకునే వేల దాటిపోయెనని ప్రశ్నవేయకుంటే మంచిదే ఇద్దరికీ పెద్ద కొడుకంటే ముద్దేలే ఏ తండ్రికి అందుకనె గుండె నీ గురు పీఠమైనది ఆరాధ్య దైవమని కొని యాడుతున్నది అంతకుమించిన భాగ్యమేదిరా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చరగ తలుపు తీసెరా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాచే తండ్రివి నీవేనని రూపములనేకములైన శ్రీ సాయిని నమ్ముకున్న వారికెల్ల నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖ శాంతి నెలవులై వెన్నంటి నువ్వుంటే లోటే లేదురా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా రవి తేజ కిరణమే నీ శరణు కోరుతూ చరణాలను చరగ తలుపు తీసెరా బాబా లే లే బాబా నిదురలేవయ్యా ఏలే స్వామీ మేలుకోవయ్యా

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kunthi Puthrudu

See All