Song Details
Lyrics
పల్లవి: అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే చరణం 1: ఏనాటిదో ఈ అనుబంధం...ఉ..ఉ.. ఎద చాలని మధురానందం..ఉ.. ఏనాటిదో ఈ అనుబంధం.. ఎద చాలని మధురానందం..ఊ.. నేనేడు జన్మలు ఎత్తితే.. ఏడేడు జన్మలకు ఎదిగే బంధం ఇది వీడరాని బంధం.. మమతానురాగ బంధం... అనురాగ దేవత నీవే..ఏ... చరణం 2: నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే.. నను నన్నుగా ప్రేమించవే.. నీ పాపగా లాలించవే... నా దేవివై దీవించవే.. నా కోసమే జీవించు నీ దివ్యసుందర రూపమే.. నా గుండె గుడిలో వెలిగే దీపం నా జీవితం నీ గీతం.. మన సంగమం సంగీతం... అనురాగ దేవత నీవే.. నా ఆమని పులకింత నీవే నా నీడగా ఉంది నీవే.. నీ తోడుగా ఉండనీవే.. ఉండిపోవే.. అనురాగ దేవత నీవే..
Lyrics sourced from public databases. May contain errors.