Song Details
Lyrics
పల్లవి: ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ.... తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు ఆగాలి ఆగాలి అమ్మాయీ గారూ.... తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు తగ్గాలి కాబోయె శ్రీమతి గారు ఆగదింక ఈ గాలి ఈ జోరు చరణం: 1 మాఘమాసం దాకా ఆగలేనూ తాళికట్టే దాక తాళలేను ..ఆహా మాఘమాసం దాకా ఆగలేనూ తాళికట్టే దాక తాళలేను మొహమాట పడకు.. నా మోహం పెంచకు మొహమాట పడకు.. నా మోహం పెంచకు ఈ మోహం ఈ దాహం మోయలేను కలలేకంటూ నిదుర కాయలేను ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ తగ్గాలి కాబోయె శ్రీవారు.. తమరింక కాలేదు మావారు చరణం: 2 కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు కోమలాంగి నడకలు కొండవాగు మెలికలు ఆ నవ్వులు విరిసిన విరిసిన పువ్వుల పకపకలు కోడె వయసు పిలుపులు కోన త్రాచు వలపులు ఆ చూపులు ఎగసిన సొగసరి గువ్వల గుసగుసలు మంచు కరిగి పోతోంది ఎండ వేడికి మనసు రగిలిపోతోంది కొండ గాలికి ఆగాలి ఆగాలి అమ్మాయీ గారు తగ్గాలి కాబోయె శ్రీమతి గారు.. ఆగదింక ఈ గాలి ఈ జోరు చరణం: 3 మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు ఆ ఆ ... మల్లె గాలి వీస్తుంటే మనసు నిలవదూ చుక్క వెన్నెలొస్తుంతే పక్క కుదరదు ఆ చూపు చూడకు నా తాపం పెంచకు ఆ చూపు చూడకు నా తాపం పెంచకు ఆ తీపి ఈ తాపం ఓపలేనూ.. ఎదుటే ఉన్న తెరలు తీయలేను ఆగాలి ఆగాలి ఈ గాలి జోరూ లలల లలల లలల తగ్గాలి కాబోయే శ్రీవారు తమరింక కాలేదు మా వారు ఆగాలి ఆగాలి అమ్మాయిగారూ లలల లలల లలల తగ్గాలి కాబోయె శ్రీమతి గారు అహా ఆగదింక ఈ గాలి ఈ జోరు
Lyrics sourced from public databases. May contain errors.