Abacha
Song
Movie
-
Music Directors
- Shankar MahadevanEhsaan Noorani
Lyricist
-
Singers
- Mahalakshmi Iyer
Lyrics
- అమ్మమ్మా.. అమ్మమ్మా.. అమ్మమ్మమోయ్..
జామురేయి వేళల్లో వీరుడల్లే వస్తాడు
భామలున్నా వీధుల్లో ఓరకంట చూస్తాడు
అందమైన మాటల్తో హే.. ఆశ రేపుతుంటాడు
కొంచెమైన నమ్మారో అంత దోచుకెల్తాడు
ఇదిగో ఇదిగో ఇతడే ఇతడే మన పడుచు యదలకెదురుపడిన ముదురు మదనుడు
పోరా పోకిరి రాజా ఆ రాజా..
పోరా దూకుడు రాజా ఏ రాజా..
జా జా వంకరరాజా ఏ రాజా..
పోరా జింకల రాజా రాజా రాజా..
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ
ఎంత పనీ పనులొదిలేసి సొగసులకేసి గుటకలువేసే పెద్ద పనీ..
మా రూపు రేఖ పొగిడే నీ పెదవికెంత కష్టం
మా చుట్టు తిరిగి అరిగే నీ కాళ్ళ కెంత నష్టం
చెవిలోన పువ్వులెట్టు చేతి వేళ్ళ నొప్పి నరకం
అయినా గాని అలుపే మాని మన కులుకు గెలికి పులుపు దులుపు చిలిపి కృష్ణుడు
పోరా మాయల రాజా ఆ రాజా..
పోరా మర్కట రాజా ఏ రాజా..
జా జా తిమ్మిరి రాజా ఏ రాజా..
పోరా తికమక రాజా రాజా రాజా..
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ
కొంటె పని వలలను వేసీ నలుగురిలో మా విలువను పెంచే మంచి పనీ
నీ గాలి సోకలేనీ మా మబ్బుకేది వర్షం
నీ వేడి తాకలేని మా పసిడి కాదు హారం
నీ కంటి ఘాటు తగలలేని ఒంటికేది గర్వం
కనుకే వినుకో కబురే అనుకో ఇది మగువనెపుడు బయటపడని మనసు చప్పుడు
హే రా రా మబ్బుల రాజా రాజా..
రా రా రంగుల రాజా రాజా..
ఆజా అల్లరి రాజా ఏ రాజా..
రా రా అందరి రాజా..
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బబ్బచ
అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ అబ్బచ హే అబ్బబ్బచ
Konchem Ishtam Konchem Kashtam
Movie More SongsAbacha Keyword Tags