Song Details
Lyrics
ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నా మదిలో నీవై నిండిపోయెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నీ రూపమె దివ్య దీపమై నీ నవ్వులె నవ్య తారలై నా కన్నుల వెన్నెల కాంతి నింపెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే పాలబుగ్గలను లేతసిగ్గులు పల్లవించగా రావే నీలిముంగురులు పిల్ల గాలితో ఆటలాడగా రావే కాలి అందియలు గల్లుగల్లుమన కాలి అందియలు గల్లుగల్లుమన రాజహంసలా రా...వే ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నామదిలో నీవై నిండిపోయెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... చరణం: 2 నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలురేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే నిదుర మబ్బులను మెరుపు తీగవై కలలురేపినది నీవే బ్రతుకు వీణపై ప్రణయ రాగములు ఆలపించినది నీవే పదము పదములో మధువులూరగా... పదము పదములో మధువులూరగా కావ్యకన్యవై రావే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో... నా మదిలో నీవై నిండిపోయెనే... ఏ దివిలో విరిసిన పారిజాతమో ఏ కవిలో మెరిసిన ప్రేమగీతమో...
Lyrics sourced from public databases. May contain errors.