Song Details
Lyrics
ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ.. ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ.. తీయని సన్నాయి కోయిల వాయించే తీయని సన్నాయి కోయిల వాయించే తొలకరి మేఘాలు బాజాలు మోగించె మల్లె పందిరేసింది మంచు చిందులేసింది నెమలి పురివిప్పి నాట్యాలాడే ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ.. హోయ్ కెరటాల చినుకులు జలకాలాడించె ఆ కెరటాల చినుకులు జలకాలాడించె పగడాల చివురాకు పైటను సవరించె గాలి ఈల వేసింది.. తీగ కొంగులాగింది కొంటె తుమ్మెదలు మాటేశాయి.. ఓయమ్మా చిలకమ్మా అల్లంత దూరాన సెలయేటి తీరాన అందాల తోటలోన మందారం కన్ను విచ్చింది.. కన్నె మందారం కన్ను విచ్చిందీ..
Lyrics sourced from public databases. May contain errors.