MovieGQ

Jo Lali Jo

Kanam (2018) · Track 1 of 5

Song Details

Lyrics

జో లాలిజో జో లాలిజో నీ లాలిపాటను మరచావేలా ఏ బంధమో మీకున్నదీ నీ నీడల్లే నిన్నే చేరెనిలా జో లాలిజో జో లాలిజో నీ లాలిపాటను మరచావేలా తానెవ్వరో నువ్వెవ్వరో అమ్మా అంటు ఆ గుండె పిలిచెలే నువ్వు చూసిన ప్రాణమే నీతో నడిచే కొంగు పట్టి వెంట కదిలె నీతో నీడలా గాయం కనిపించని నీ గేయం ఇదిలే ప్రాణమవని ప్రాణమేదో ప్రాణమే కోరెన్ వెన్నెలో పుట్టే నీజాబిలమ్మా నీ కంటి వెలుగై తానున్నదే నీకేమి కానీ నీ భాగమేదో నిను వీడిపోకా తోడున్నదీ కాలం మళ్ళీ ఎదురవ్వదూ దింపేసిన భారమే శ్వాసై కలిసే నువ్వు కనని జననమేదో నిన్నే చేరెనే నువ్వే కనిపెంచనీ నీ రూపం తనదో అమ్మ ఐనా అమ్మ కానీ అమ్మతో ఉన్నదో పొద్దుల్లో అలసి నువ్వు సోలిపోతే నీ కురులే నిమిరే ఓ అమ్మలా నీ కంటి వెనుక కలలేవొ తెలిసి నీ ముందు నిలిపే పసిపాపలా పాశం నిన్ను ప్రేమించెనే

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Kanam

See All