Dolu Baja Sannayi
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singer
-
Lyrics
- పందిరి చేరెనమ్మా పచ్చని పూలకొమ్మా
దీవించమ్మ ప్రేమా.......
ప్రియతమా........ సుఖీభవ
డోలుబాజా సన్నాయి మోగుతామంటున్నాయి
గౌరిపూజ కానియ్యి పెళ్ళిచేస్తామన్నాయి
రాముడే నీ వరుడయ్యి ప్రేమతో నీ వరసయ్యి
వరమల్లె నిను చేరగా
జంటగా నవ వధువయ్యి వెళ్ళవే నువ్వెదురయ్యి
వరమాలగా వాలగా
కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం
ఏమినోము నోచావమ్మా కుందనాల కూనమ్మా
నీకు సొంతమయ్యిందమ్మా నమ్ముకున్న నీప్రేమ
రాసిపెట్టి ఉంచాడమ్మా ముందుగానే ఆ బ్రమ్హ
జంటగానె పుడుతుందమ్మా పొందుతున్న ప్రతిజన్మ
త్రేతాయుగం నాటి సీతమ్మ మనువంట ఈ తంతు మాకోసమే
ఏటేటా జరిగేటి శ్రీరామ నవమంట ఈ పెళ్ళి అపురూపమే
కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం
పాలకడలి కూతురువంట కాలుపెడితె చాలంట
కట్టుకున్న ప్రతి నట్టింటా అష్టసిరుల కొలువంట
శాశ్వతంగ ఇక నీఇంట ఛైత్రమాసమేనంట
సంబరంగ ఇక ప్రతిపూటా సంకురాత్రి పండగట
కనవమ్మ కళ్యాణి ఈనాటి కళలని శ్రీవారి కనుపాపలో
వినవమ్మ అలివేణి ఈవేదమంత్రాన్ని నూరేళ్ళ కౌగిళ్ళలో
కళ్ళవిందుగా చూడాలంట వేడుకైన ఈ కళ్యాణం
పూలవాగులా పొంగాలంట వెల్లువైన ఈ వైభోగం
- పందిరి చేరెనమ్మా పచ్చని పూలకొమ్మా
Kalyana Ramudu
Movie More SongsDolu Baja Sannayi Keyword Tags
-
-
-