Nee Chekkili Vela Entha
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత
కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత
కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా
నాకేల ఆ చింత నీ చెంత
నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత
మల్లెలిచ్చి కొంటాలే మత్తు మత్తు నీ నవ్వు
పాపనిచ్చుకుంటాలే రెప్పలాంటి నీ సోకు
మల్లెలిచ్చి కొంటానే మత్తు మత్తు నీ నవ్వు
పాపనిచ్చుకుంటాలే రెప్పలాంటి నీ సోకు
అందమిచ్చి ఆదుకో అదుపులేని ఆకల్లు
పెడవితోనే వేసుకో ప్రేమ పూల సంకెళ్లు
నీలి కొండ నీటి ఎండ నీడల్లో
గోరువెచ్చ వెన్నెలమ్మ కోనల్లో
వేస్తాలే వెయ్యేళ్ల సంకెళ్లు
నీ చెలిమికి వెల ఎంత హ నీ వెచ్చని వలపంత
హ నీ నవ్వుల వెల ఎంత హ నీ మల్లెల మనసంతా
కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా
కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత
నాకేల ఆ చింత నీ చెంత
నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ వెచ్చని గిలిగింత
సిగ్గులిచ్చి కొంటాలే బుగ్గమీద నీ గుర్తు
దమ్ములిచ్చి కొంటాలే అమ్ముకోని నీ గుర్తు
సిగ్గులిచ్చి కొంటాలే బుగ్గమీద నీ గుర్తు
దమ్ములిచ్చి కొంటాలే అమ్ముకోని నీ గుర్తు
సందె బేరమాడుకో చందమామ సంతల్లో
రాయబార మెందుకో చందమామ సైగల్లో
హత్తుకున్న హాయిగున్న గంటల్లో
హాయికన్న తీయగున్న మంటల్లో
కౌగిళ్ళ నూరేళ్ళ పెళ్ళిళ్ళు
నీ చెక్కిలి వెల ఎంత హ నీ చెక్కెర ముద్దంత
హ నీ కౌగిళి వెల ఎంత హ నీ ముద్దుల గిలిగింత
కన్నుకుట్టి నోళ్ళ చూపు కవ్వింత
కన్నుకొట్టి నోళ్ళ ఊపు ఊరంతా
నాకేల ఆ చింత నీ చెంత
నీ చెలిమికి వెల ఎంత హ నీ వెచ్చని వలపంత
హ నీ నవ్వుల వెల ఎంత హ నీ మల్లెల మనసంతా
Justice Chowdary
Movie More SongsNee Chekkili Vela Entha Keyword Tags
-
-