MovieGQ

Chattaniki Nyayaniki

Justice Chowdary (1982) · Track 7 of 7

Lyrics

చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టు బడని తీర్పు కన్నీటికి కరిగిపోని ఈ తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్పా... తప్పా... తప్పా... నో నెవర్ I am in the hands of law Anything happens its not my law కఠినమన్నది ధర్మం కన్నులేనిది న్యాయం మనసు లేనిది చట్టం మనిషి జన్మకి ఖర్మం న్యాయమూర్తిగా నేనెప్పుడూ న్యాయస్థానం నాదైనప్పుడు నాకు మీరు లేరు నేను నేను కాను నేను నేను కాను ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు తప్పా... తప్పా... నో సత్యం కోసం హరిచంద్రుడు సతి సుతులని ఎడబాసింది గర్భవతిని సీతమ్మని రాముడు కారడవికి పంపించింది కన్న తల్లిని కాదని కర్ణుడు రాజా త్యాగం చేసింది కన్న కొడుకునే కాదని నేనే కన్నీటిని దిగమింగుతుంది ఎందుకోసం ఆ ఎందుకోసం దహించిన అది ధర్మమా గనుక సహించాలి అది సత్యం గనుక కృశించినా నే నశించిన అది న్యాయం గనుక ఆ న్యాయమే నా దైవం గనుక చట్టానికి న్యాయానికి జరిగిన ఈ సమరంలో ధర్మానికి రక్తానికి జరిగిన సంగ్రామంలో కడుపు తీపికి కట్టు బడని తీర్పు కన్నీటికి కరిగిపోని ఈ తీర్పు ఇది ఆ దైవమే ఇచ్చిన తీర్పు

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Justice Chowdary

See All