Song Details
Lyrics
అసుర రావణాసురా అసుర అసుర రావణాసురా విశ్వ విశ్వ నాయక రాజ్య రాజ్య పాలక వేళా వేళా కోట్ల అగ్ని పర్వతాల కలయిక శక్తి శక్తి సూచిక యుక్తి యుక్తి పాచిక సహస్ర సూర్య సాగరాలు ఒక్కటైనా కదలికా ఓ..ఓ…ఏక వీర..సూరా.. క్రూరా..కుమారా… నిరంకుశంగ దూకుతున్న దానవేశ్వరా ఓ...ఓ..రక్త ధారా.. చోర..ఘోరా..అఘోరా కర్కశంగ రేగుతున్న కాలకింకరా రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై… రావాణా..జై జై జై… సింహాసనా..జై జై జై… అసుర..అసుర....అసురా..అసుర..రావణాసురా అసుర..అసుర.అసురా..అసుర..రావణాసురా చిత్ర చిత్ర హింసక మృత్యు మృత్యు ఘంటిక ముజ్జగాల ఏకకాల పలు రకాల ధ్వంసకా ఖడ్గ భూమి ధార్మిక కదనరంగ కర్షకా రామనగర పట్టణాల సకల జన ఘర్షక ఓఓఓఓ…అంధకరా.. తార..ధీర..సుధీరా.. అందమైన రూపమున్న అతి బయంకరా ఓ..ఓ..దుర్వితారా.. భైరా..స్వైరా..విహార పాప లాగ నవ్వుతున్న ప్రళయ భీకరా రావాణా..జై జై జై… శత్రు శాసన..జై జై జై రావాణా..జై జై జై … సింహాసనా..జై జై జై నవరసాల పోషక నామరూప నాశకా వికృతాల విద్యలెన్నో చదివినా వినాశక చరమగీత నాయకా నరక లోక నర్తక అక్రమాల లెక్కలోన నిక్కిన అరాచకా ఓఓఓ…అహంకారా.. హారా..బారా..కిషోరా.. నరాలు నాగు పాములైన నిర్భయేశ్వరా… ఓ..ఓ..తిరస్కార… తీరా..ఎరా..కుబేరా… కణము కణము రణములైనా కపాలేశ్వర… రావాణా..జై జై జై … శత్రు శాసన..జై జై జై … రావాణా..జై జై జై … సింహాసనా..జై జై జై …
Lyrics sourced from public databases. May contain errors.