MovieGQ

Nee Navvullo

Jagratha Bidda (2023) · Track 3 of 3

Song Details

Lyrics

నీ నవ్వుల్లో... హరివిల్లే... రంగుల పూలై పూసే... నీ నవ్వుల్లో... ఆ.... ఆ....ఆ... నీ మాటల్లో... చల చల్లని వెన్నెల వెలుగులు విరిసే... నీ మాటల్లో... ఆ... ఆ... ఆ.. నిన్నా... మొన్నలా... లేదే ఇంతలా... నువ్వే... నన్ను కలిసినాక... స్వర్గం పక్కనే ఉన్నట్టుందిగా... నీ ప్రేమే... దొరికాకా... ఈ భువి పైన ఇంతందాన్ని చూ...సా...రా... ఆ దివి తార నా ఎదుటే నిలిచేరా... నను నేనే మరిచానే... పిల్లో... నువ్వొచ్చాక... సుందరాంగి చూపు చక్కనైన రూపు గుండె కోసినాదిరో... చిన్నదాని సోకు సన్నజాజి తీగై నన్నే అల్లుకుందిరో... నీ నవ్వుల్లో... హరివిల్లే... రంగుల పూలై పూసే... నీ నవ్వుల్లో... హ.. హ... అవునా... చూపే... సుమ బాణాల గాలం చేసే... ఎదలో... తీపి గాయం నీతో... ప్రతిరోజూ... వసంతం... నేనే.... ఐపోయా... నీ సొంతం... నువ్వు నడిచే దారుల్లోనే... చందనాల పరిమళమే... నువ్వు పలికే... మాటల్లోనే... సుస్వరాల సంగీతమే నువులేని లోకంలో... నేనే ఉండలేనమ్మో.... సుందరాంగి చూపు చక్కనైన రూపు గుండె కోసినాదిరో... చిన్నదాని సోకు సన్నజాజి తీగై నన్నే అల్లుకుందిరో... నువ్వే... ఆనందాల తీరం నేనే... కానెప్పుడూ నీ దూరం నీతో... కలిపింది ఈ కాలం కడదాకా... సాగాలి... మన పయనం... ఒంటరైన నా గుండెల్లోనే... ప్రేమగ నువు చేరావే... జంటగా... నా వెంటే నడిచి కొత్త దారి చూపించావే... కలనైనా... ఇలనైనా... నువ్వే ఈ జన్మంతా... సుందరాంగి చూపు చక్కనైన రూపు గుండె కోసినాదిరో... చిన్నదాని సోకు సన్నజాజి తీగై నన్నే అల్లుకుందిరో...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Jagratha Bidda

See All