Song Details
Lyrics
ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బందమా పలుకలేని భావమా మరువలేని స్నేహమా మరలిరాని నేస్తమా ప్రియతమా ప్రియతమా ప్రియతమా... ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా ఎదుట ఉన్న స్వర్గమా చెదిరిపోని స్వప్నమా కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా... ప్రియతమా ప్రియతమా ప్రియతమా... ప్రియతమా నను పలకరించు ప్రణయమా నింగి వీణకేమో నేల పాటలొచ్చె తెలుగు జిలుగు అన్నీ తెలిసి పారిజాత పువ్వు పచ్చి మల్లెమొగ్గ వలపే తెలిపే నాలో విరిసి మచ్చలెన్నో ఉన్న చందమామ కన్న నరుడే వరుడై నాలో మెరిసే తారలమ్మ కన్నా చీరకట్టుకున్న పడుచు తనమే నాలో మురిసె మబ్బులన్నీ వీడిపోయి కలిసే నయనం తెలిసే హృదయం తారలన్నీ దాటగానే తగిలే గగనం రగిలే విరహం రాయలేని భాషలో ఎన్ని ప్రేమలేఖలో రాయి లాంటి గొంతులో ఎన్ని మూగ పాటలో అడుగే పడక గడువే గడిచీ పిలిచే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా ప్రాణవాయువేదో వేణువూది పోయే శృతిలో జతిలో నిన్నేకలిపి దేవగానమంతా ఎంకిపాటలాయే మనసు మమత అన్నీ కలిసి వెన్నెలల్లే వచ్చీ వేద మంత్రమాయె బహుశా మనసా వాచా వలచి మేనకల్లే వచ్చీ జానకల్లే మారే కులము గుణము అన్నీ కుదిరి నీవులేని నింగిలోన వెలిగే ఉదయం విధికే విలయం నీవులేని నేలమీద బ్రతుకే ప్రళయం మనసే మరణం వానవిల్లు గుండెలో నీటికెన్ని రంగులో అమృతాల విందులో ఎందుకిన్ని హద్దులో జగమే అణువై యుగమే క్షణమై మిగిలే ప్రియతమా నను పలకరించు ప్రణయమా అతిధిలా నను చేరుకున్న హృదయమా బ్రతుకులోని బందమా పలుకలేని భావమా కనులలోని కావ్యమా కౌగిళింత ప్రాణమా... ప్రియతమా, ప్రియతమా, ప్రియతమా... ప్రియతమా... నను పలకరించు ప్రణయమా అతిధిలా... నను చేరుకున్న హృదయమా
Lyrics sourced from public databases. May contain errors.