Song Details
Lyrics
సూటిగా... చూడకు సూదిలా... నవ్వకు ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తియకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు సూటిగా... చూడకు సూదిలా... నవ్వకు నింగిలో మెరుపల్లె తాకినది నీ కల నేల పై మహారాణి చేసినది నన్నిలా అంతఃపురం సంతోషమై వెలిగిందిగా అందాలనే మించే అందం అడుగేయగా అంతా నీ వల్లే నిమిషంలో మారిందంట బంతి పూవల్లే నా చూపే విచ్చిందంట సూటిగా... చూడకు సూదిలా... నవ్వకు సీతా కళ్యాణ వైభోగమే రామా కళ్యాణ వైభోగమే గౌరీ కళ్యాణ వైభోగమే లక్ష్మీ కళ్యాణ వైభోగమే గంటలో మొదలైంది కాదు ఈ భావన గత జన్మలో కదిలిందో ఏమో మన మధ్యన ఉండుండి నా గుండెల్లో ఈ అదురేమిటో ఇందాకిలా ఉందా మరి ఇపుడెందుకో నీలో ఈ ఆశే కలకాలం జీవించాలి నీతో జన్మంతా ఈ రోజల్లే ఉండాలి సూటిగా... చూడకు సూదిలా... నవ్వకు ఎదురుగ నిలబడుతూ ఎదనే తినకు నడుముని మెలిపెడుతూ ఉసురే తియకు సొగసే సెగలే పెడితే చెదరదా కునుకు
Lyrics sourced from public databases. May contain errors.