Nuvvala Dooranga
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Chinni Charan
Lyrics
- నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా
ధీరుడే దీనంగా మారె నీ వల్లేగా
మన్నించమంటే వినవుగా
నీ రాక నాకు చీకటింట దీపంగా
నన్ను చూడమాకు పట్టరాని కోపంగా
నిన్ను మా అమ్మకన్న అపురూపంగా అనుకున్నానుగా
నీ నువ్వులేని చూపునాకు నరకంగా
ఎన్ని పువ్వులున్నా ఎడారి ఎదురుంగా
నా తప్పునేను ఒప్పుకుంటున్నాగా
కరుణించవే దేవతగా
నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా
చరణం: 1
కెరటం లేని సంద్రం నేను నింగేలేని తారక నువు
నువ్వులేని సమయాన నేనసలు నేనేనా
గాలి నీరు ఆహారంతో బతికేస్తారే ఎవరైనా
నాకదే చాలదుగా నువ్వే నాకు ఊపిరిగా
బతికానే ఇన్నాళ్లు బహుమతిగా కన్నీళ్లు
ఇచ్చావే ఓ చెలియా ఇది నీకు న్యాయమా
నిన్ను నమ్ముకొని నీతో ఒంటరిగా
నువ్వు రమ్మన్న చోటుకి వచ్చాగా
నీకు అందుకే నేను అలుసయ్యాన
నను దండించావుగా
ఇది చేసిందంతా నువ్వేగా
ఈ విరహపు వెధ నీ వల్లేగా
మళ్ళీ నా పైనే పడి తప్పని నిందిస్తావుగా
నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా
చరణం: 2
మన్నించేటి గుణమేలేని మనిషివికావు నువ్వసలు
దేవతల జాతినువు ఎందుకే ఈ తగవు
నాలో నుండి నిన్నే వేరు చేసే వీలులేదు కదే
ప్రాణమై ఎదిగావు ఎలా వదిలిపోతావు
ఇంతకన్నా చెప్పలేనే నా హృదయం విప్పలేనే
నువుతప్పా ఏమిలేని మామూలు మనిషినే
నీ రాక నాకు చీకటింట దీపంగా
నన్ను చూడమాకు పట్టరాని కోపంగా
నిన్ను మా అమ్మకన్న అపురూపంగా అనుకున్నానుగా
నీ నువ్వులేని చూపునాకు నరకంగా
ఎన్ని పువ్వులున్నా ఎడారి ఎదురుంగా
నా తప్పునేను ఒప్పుకుంటున్నాగా
కరుణించవే దేవతగా
నువ్వలా దూరంగా నేనిలా భారంగా
ఎన్నాల్లే ఓ చెలీ ఇలాగా
ఈ గాయం సులువుగ మానదుగా
ఈ గిడవలు త్వరగా మరువనుగా
అలాగని అనువంతైనా నీపై ప్రేమే తరగదుగా
ఉరుముల వెనకే చినికులుగా
నడిరాతిరి పూర్తయి వెళుతురుగా
మన యుద్ధం తీర్చి ఇద్దరినొకటిగ
ప్రేమే కలుపునుగా...
Inkenti.. Nuvve Cheppu !
Movie More SongsNuvvala Dooranga Keyword Tags
-
-