Song Details
Lyrics
ఓ చంద్రుడా నీలోనా ఆవేశమే తగ్గేనా అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం చిరునవ్వుతో ప్రతి గుండెనీ గెలిచేయ్ ఒక్కసారి నీకోపం మీద కోపం చూపి నవ్వరా అందుకోసం నే ఎన్నిసార్లు చూస్తుంటానో అడగరా నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు నీ ఎదురుగ నిలిచిన మనసుని నువ్వు గాయం చెయ్యొద్దు సహనంతో నీకన్నీ సాధ్యం చిరునవ్వే నీ గెలుపుకి మంత్రం అందమైన ఈ లోకం అందుతుంది నీకోసం మిన్నే విరిగి నీ మీద పడ్డట్టు ఇంకేదో ఐనట్టు గొడవెందుకు నువ్వే పలికే ఖర్చేమి లేదంట తప్పేమి కాదంట నవ్వచ్చుగా నీ అందం నీ ఆనందం నీ చేతుల్లో ఉండాలంటే నువ్వింకా వదిలెయ్యాలి కోపం ఓ సంతోషం నీ దాసోహం అవ్వాలంటే సూత్రం పెదవులపై చిరునవ్వుంటే చాలురా.. ఎంత పెద్ద బాధకైన పలకరింపే మంచి మందు చిరునవ్వుతో ప్రతిగుండెనీ గెలిచేయ్ ఒక చూపుతో చిరుకాంతులే పంచేయ్ పిల్లగాడా నువ్వు నవ్వావంటే నాలో వీణే మోగురా నీ నవ్వుకోసం నే ఎన్నిసార్లు చూశ్తున్నానో అడగరా నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు నీ పెదవులపైనా నవ్వుని ఆపే నేరం చెయ్యొద్దు నీ మనసులో కలిగే సంతోషానికి వారధి కట్టద్దు సహనంతో నీకన్నీ సాధ్యం చిరునవ్వే వీడొద్దు నువ్వే
Lyrics sourced from public databases. May contain errors.