Kannullona
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Hariharan
Lyrics
- కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే (2)
వలపంటే అదే .. నీ వలనే అనీ
కలిగిందే అనీ .. వయసన్నదీ
వయసంతా .. పెదవుల్లో
కదిలిందే ఏదో .. కోరిందే
కదిలే ఈ కాలం .. ఆగిందే
కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే
ఊపిరిలో ఆవిరులే వేసాకాలం
వేసవిలో నీ చెలిమే శీతాకాలం
కలకాలం .. కలగాలీ .. కులుకుల్లో జ్వరం
కలిగే .. ఆ జ్వరమే .. ఉడికించే వరం
ఎన్నో వరములనే నువ్వే ఇస్తున్నా
ఇంకా ఇంకొకటీ కావాలంటున్నా !
కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే
ఇంకొకటీ వేరొకటీ నాదౌతుంటే
ఇప్పటికీ ఇచ్చినదీ ఇంకా కొంతే
ఇది కొంతే .. అనుకుంటే .. ఇక ఇస్తాను నా
ప్రాణం .. అది చాలా .. మరి ఈ జన్మకీ
ప్రాణం లో వెలిగే ప్రేమే కావలెనే
ప్రేమించే మదిలో చోటే కావలెనే
కన్నుల్లోన కనబడే .. మెరుపులన్నీ తలపులే
గుండెల్లోన వినబడే .. తలపులన్నీ వలపులే (2)
Hero
Movie More SongsKannullona Keyword Tags
-
-