Priyaraagale
Song
Movie
-
Music Directors
- Raj
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- ఓ...ఓ...ఓ, ఓ...ఓ...ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ...ఓ...ఓ, ఓ...ఓ...ఓ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చరణం: 1
అల్లరి కోయిల పాడిన పల్లవి స్వరాలలో నీవుంటే పదాలలో నేనుంటా
వేకువ పూసిన తొలితొలి గీతిక ప్రియా ప్రియా నీవైతే శృతి లయ నేనౌతా
కలకాలం కౌగిలై నిన్నే చేరుకోని
కనురెప్పల నీడలో కలే ఒదిగి పోనీ
ఓ ప్రియా... ఓ... దరిచేరితే దాచుకోనా
తొలి ప్రేమలే దోచుకోనా
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చరణం: 2
సవ్వడి చేయని యవ్వన వీణలు అలా అలా సవరించూ పదే పదే పలికించూ
వయసులు కోరిన వెన్నెల మధువులు సఖీ చెలీ అందించూ సుఖాలలో తేలించూ
పెదవులతో కమ్మనీ కథే రాసుకోనా
ఒడి చేరి వెచ్చగా చలే కలుసుకోన
ఓ ప్రియా... ఓ... పరువాలనే పంచుకోనీ
పడుచాటలే సాగిపోనీ
ప్రియరాగాలే గుండెలోన పొంగుతున్న ఈవేళా
ప్రియగానాలే కన్నెప్రేమ దోచుకున్న శుభవేళా
చేరాలి సొగసుల తీరం సాగాలి తకధిమి తాళం
తగ్గాలి తనువుల దూరం తీరాలి వయసుల తాపం
ఓ...ఓ...ఓ, ఓ...ఓ...ఓ
Hello Brother
Movie More SongsPriyaraagale Keyword Tags