MovieGQ

Ra Rakumara

Govindudu Andarivadele (2014) · Track 3 of 6

Lyrics

రా రా కుమారా రాజసాన ఏలగా ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా నీవు తీసె శ్వాసలో ఊయలూగే ఆశతో పంపుతున్నా నా ప్రాణాన్ని నీ వైపుగా... చరణం: 1 నీ తలపులతో మరిగిపోయె ఒంటరి తనమూ ఇష్టమే నీ కబురులతో కరిగిపోయె ప్రతి ఒక క్షణమూ ఇష్టమే కలలే నిజమయేలా కళ్లు తెరిచిన కోరిక ఇష్టం నిజమే కల అయేలా ఒళ్లు మరచిన అయోమయం మరింత ఇష్టం రా రా రాకుమారా రాజసాన ఏలగా ఎదపై చేరనీరా పూలమాలె నేనుగా చరణం: 2 బరువనిపించే బిడియమంతా నీ చేతులలో వాలనీ బతకడమంటే ఎంత మధురం నీ చేతలలో తెలియనీ నేనేం చేసుకోను నీవు పంచని ఈ హృదయాన్ని ఇంకేం కోరుకోను నిన్ను మించిన మరోవరం ఏదైనా గానీ...

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Govindudu Andarivadele

See All