Andamaa Andamaa
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- S.P. Balasubrahmanyam
Lyrics
- అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
అందమా అందుమా అందనంటే అందమా
ఆకలుండదే దాహముండదే
ఆకతాయి కోరిక కొరుక్కుతింటదే
ఆగనంటదే దాగనంటదే
ఆకుచాటు వేడుక కిరెక్కమంటదే
వన్నెపూల విన్నపాలు విన్నానమ్మి
చిటికనేలు యిచ్చి ఏలుకుంటానమ్మి
రాసి పెట్టి ఉందిగనక నిన్నే నమ్మి
ఊసులన్ని పూసగుచ్చి ఇస్తాసుమ్మి
ఆలనా పాలనా చూడగా చేరనా చెంత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
వెయ్యి చెప్పినా లక్ష చెప్పినా
లక్ష్య పెట్టదే ఎలా ఇదేమి విలవిలా
తియ్య తియ్యగా నచ్చ చెప్పని
చిచ్చి కోట్టనీ ఇలా... వయ్యారి వెన్నెల
నిలవనీదు నిదరపోదు నారాయణ
వగల మారి వయసు పోరు నా వల్లన
చిలిపి ఆశ చిటికలోన తీర్చేయ్యనా
మంత్రమేసి మంచి చేసి లాలించనా
ఆదుకో నాయనా... ఆర్చవా... తీర్చవా... చింత
అందమా అందుమా అందనంటే అందమా
చైత్రమా చేరుమా చేరనంటే న్యాయమా
ప్రాణమున్న పైడిబొమ్మ పారిజాత పూలకొమ్మ
పరవశాలు పంచవమ్మ పాల సంద్రమా
ఆడుమా పాడుమా మౌనమే మానుకోవమ్మ
Govinda Govinda
Movie More SongsAndamaa Andamaa Keyword Tags
-
-