Mudinepalli Madichelo
Song
Movie
-
Music Director
-
Lyricist
-
Singers
- Shahul HameedSwarnalatha Jr.
Lyrics
- ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
బుట్ట మీద బుట్టపెట్టి బుగ్గ మీద చుక్కపెట్టి
వాగల్లే నడిచావే
నీ బుట్టలోన పువ్వులన్నీ గుట్టులన్నీ రట్టుచేసి
నన్నీడ పిలిచేనే
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
పల్లి పల్లి ముదినేపల్లి
పల్లి పల్లి ముదినేపల్లి
కాటుక కళ్ల వాడల్లో
కట్టుకుంటా గుడిసెంటా
పసుపుతాడు పడకుండా
ఆగడాలే వద్దంటా
చింతపల్లి చిన్నోణ్ని
చూడు నీకు వరసంటా
వరస కాదు నాకంట
మనసు ఉంటే చాలంటా
పగలు రేయి... నీతో ఉంటా
ఉన్నావంటే... అది తప్పంట
కలిసి వస్తే వెన్నెలమాసం
చెయ్యలి జాగారం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే
తమలపాకు తడిలోన
పండెనే నీ నోరంటా
నోటి పంట కాదంటా
పాడిపంట చూడంటా
నాకు నువ్వే తోడుంటే
సంబరాలే నట్టింట
ఆశపడిన మావయ్యది
అందమైన మనసంట
అందం చందం నీకే సొంతం
వెన్నోల్లోనే యేస్తా మంచం
పైరగాలుల పందిరిలోన
కరిగిపోదాం మనం
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మా
నీ కొంగు పొంగు నా గుండె కోసెనమ్మా
ముదినేపల్లి మడిచేలో ముద్దుగుమ్మ
నువ్వు ఓరకంట చూశావో నెల తప్పేనమ్మా
బుట్టమీద బుట్టపెట్టి నేను పువ్వులమ్ముతుంటే
కనుసైగ చేస్తావే
ముట్టుకుంటే కందిపోవు ముద్దరాలి సొగసుకు
గాలాలే యేస్తావే
Gentleman
Movie More SongsMudinepalli Madichelo Keyword Tags
-
-