MovieGQ

Kontegadni Kattuko

Gentleman (1993) · Track 1 of 5

Song Details

Lyrics

కొంటెగాణ్ణి కట్టుకో కొంగుతీసి చుట్టుకో కోటి వన్నెలున్నదాన అందమంతా ఇచ్చుకో అందినంత పుచ్చుకో వాలు కళ్ళ పిల్లదాన తీరాలి అచ్చట్లు సాగాలి ముచ్చట్లు సిగ్గుల్లో జారిపోవాలి చీకట్లు చరణం: 1 అందరిని దోచే దొంగ నేనేలే నా గుండె దోచుకున్న దొరసాని నీవేలే(2) చిన్నారి మైనా చిన్నదానా నే గాలం వేసానంటే పడి తీరాలెవరైనా బంగారమంటి సింగారం నీదే అందం సొంతమైతే లేనిదేదీ లేదే చరణం: 2 కొనచూపుతోనే వేసావు బాణం రేపావు నాలో నిలువెల్లా దాహం కొరగాని వాడితో మనువు మధురం ఈ మొనగాడే నావాడైతే బతుకు బంగారం చిగురాకు పరువం చెలరేగే అందం నీకు కానుకంట ప్రతిరోజూ పండగంట

Lyrics sourced from public databases. May contain errors.

Other Songs from Gentleman

See All